ఎపిలో 11,573 కొత్త కేసులు..

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గాయి. గ‌డిచిన 24 గంటల్లో 40,357 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 11,573 మందికి పాజిటివ్‌గా తేలింది. నిన్న ఒక్క‌రోజులో 9,445 మంది క‌రోనా వైర‌స్ నుండి కోలుకున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారితో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా మృతి చెందిన వారి సంఖ్య 14,594 కి చేరింది. ప్ర‌స్తుంల రాష్ట్రంలో 1,15,425 యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది.

Leave A Reply

Your email address will not be published.