TS: ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి పాఠశాల విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. వచ్చేనెల 8వ తేదీ నుండి మార్చి 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 16న ఏడో తరగతి నుండి పదో తరగతులలో ప్రవేశానికి, 17 వ తేదీన ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తారు. మే 20వ పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నారు.