ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ విజేత రఫెల్ నాదల్..
21 గ్రాండ్‌స్లామ్‌లు కైవసం

ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను రఫెల్ నాదల్ సొంతం చేసుకున్నాడు. ఈటైటిల్‌తో ఇతను 21 గ్రాండ్‌స్లామ్‌లను సాధించి, ప్రపంచంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్లను కైవసం చేసుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2009 తర్వాత నాదల్ మళ్లీ ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం చేసుకున్నాడు. ఇది తన కెరీర్‌లో రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ .
రఫెల్ నాదల్, మొద్వెదెవ్ మధ్య హోరాహోరీగా సాగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మొద్వెదెవ్ పై 2-6, 6-7, 6-4, 6-4, 7-5 తేడాతో నాదల్ విజయం సాధించాడు. తొలి రెండు సెట్లను కోల్పోయిన నాదల్..చివరి మూడు సెట్లలో విజయం సాధించాడు.