జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

మల్యాల (CLiC2NEWS): జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలంలో బైక్, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మల్యాల మండలం రాజారాంపల్లి సమీపంలో జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం ఆటో, ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి గాయలయ్యాయి. వీరిని జగిత్యాల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారు జగిత్యాల పరిధిలోని అర్భన్ కాలనీలో నర్మించే రెండు పడకగదుల నిర్మాణంలో కార్మికులుగా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.