ఎపిలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. పదివేలకు పైగా నమోదయ్యే రోజువారీ కేసులు ఆరువేలకు చేరువలో నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 5,879 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా వైరస్‌తో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజులో 11,384మంది కరానా నుండి కోలుకున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.