రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడి..

ప్రధానమంత్రి నరేంద్రమోడి సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితంచేశారు. పంచలోహాలతో రూపొంది, కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే ఇది రెండవ అతి పెద్ద విగ్రహంగా గుర్తింపు పొందింది. ఈకార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మైం హోం గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు పాల్గొన్నారు.