11న జనగామకు సిఎం కెసిఆర్.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

హైదరాబాద్ (CLiC2NEWS): ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నెల 11న జనగామ జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లాకేంద్రంలో కొత్తగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ఆదివారం సభా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సభా వేదిక నిర్మాణానికి సంబంధించి పలు సూచనలు చేశారు.
ఈ పర్యటనలో సిఎం కెసిఆర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతారని మంత్రులు చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.