ప్రత్యేక హోదా అంశంపై చర్చకు రావాలని కేంద్ర హోంశాఖ నుండి ఆహ్వానం.
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా అంశంపై చర్చకు రావాలని రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ ఆహ్వానం పంపింది. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై ఈనెల 17వ తేదీన కేంద్ర హోంశాఖ కీలక సమావేశం ఏర్పాటు చేయబోతుంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. విభజన చట్టం షెడ్యూల్ 9, 10 లోని ఆస్తుల పంపకాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తొంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్ధిక పరమై-న అంశాలూ చర్చకు రానున్నాయి.
ఫిబ్రవరి 8వ తేదీన జరిగిన సమావేశంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఆశిష్ కుమార్, ఎపి నుంచి ఆర్దిక శాఖ కార్యదర్శి ఎస్. ఎస్. రావత్, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి కె. రామకృష్ణారావు సభ్యులుగా ఉన్నారు.
సమావేశంలో చర్చకు రానున్న ప్రధాన అంశాలు
- ఎపి ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన
- విద్యుత్ వినియోగ అంశాలు
- పన్ను అంశాల్లో సవరణలు
- APSCSCL , TSCSCL సంస్థలో నగదు అంశం
- వనరుల సర్దుబాటు
- 7వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ది నిధుల అంశం
- ప్రత్యేక హోదా
- పన్ను ప్రోత్సాహకాలు
- వనరుల వ్యత్యాసం
-