యాదాద్రి జిల్లా ఏర్పాటును ఎవ‌రూ ఊహించ‌లేదు..

భువ‌న‌గిరి (CLiC2NEWS): తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ శ‌నివారం భువ‌న‌గిరి జిల్లా క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సిఎం మాట్లాడుతూ.. యాదాద్రి-భువ‌న‌గ‌రి జిల్లా ఏర్పాటును ఎవ‌రూ ఊహించ‌లేద‌ని అన్నారు. ఉమ్మ‌డి ఎపిలో జిల్లా ఏర్పాటు కోరినా సాధ్య‌ప‌డ‌లేదు. ఎన్‌టిఆర్‌ను మంచిర్యాల జిల్లా కావాల‌ని అడిగినా ఎందుకోగానీ ఆదీ సాధ్య‌ప‌డ‌లేద‌న్నారు. భువ‌న‌గిరి సులువుగా అభివృద్ధి చెందే ప్రాంతం, హైద‌రాబాద్ వ‌రంగ‌ల్ అద్భుత‌మైన కారిడార్‌గా అభివృద్ధి చెందుతాయ‌న్నారు. భువ‌న‌గిరిలో భూముల విలువ ఎకారాకు రూ.2 నుండి 3 కోట్ల వ‌ర‌కు ఉంద‌ని, మారూమూల ప్రాంతాల‌లోను రూ 25-30 ల‌క్ష‌ల‌కు పైనే భూముల ధ‌ర‌లు ఉన్నాయ‌న్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రమైన‌ప్ప‌టికీ అనేక పెద్ద రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తోంద‌ని సిఎం పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.