‘స‌ర్కారు వారి పాట’ సాంగ్ లీక్‌.. ఇద్ద‌రు అరెస్ట్‌

భావోద్వేగానికి గురైన సంగీత ద‌ర్శ‌కుడు

హైద‌రాబాద్ (CLiC2NEWS): వాలైంటైన్స్ డే సంద‌ర్భంగా అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ ఇవ్వాల‌నుకున్న ‘స‌ర్కారు వారి పాట’ చిత్ర బృందానికి భారీ షాక్ ఎదురైంది.ఈ చిత్రం నుండి ‘క‌ళావ‌తి’ పుల్‌సాంగ్ ఆన్‌లైన్‌లో శ‌నివారం సాయంత్రం లీకైంది. ‘స‌ర్కారు వారి పాట’ చిత్రం నుండి మొద‌టి పాట‌ను ‘వాలంటైన్స్ డే’ రోజు విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించిన చిత్ర యూనిట్ ముందుగా ప్రోమో రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో చిత్ర‌బృందం
షాక్‌కు గురైనారు. పాట‌ను లీక్ చేసిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను గుర్తించి వారిని పోలీసుల‌కు అప్ప‌గించారు.

పాట లీక్ కావ‌డంతో సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్‌ భావోద్వేగానికి గుర‌య్యారు. సుమారు ఆర్నెల్లగా ఈ పాట కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డామ‌ని, ఈ పాట చిత్రీక‌రించేట‌పుడు ఎనిమిది మందికి క‌రోనా వ‌చ్చింద‌ని, అయినా స‌రే, అంద‌రం క‌లిసి ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌నిచేశామ‌న్నారు. పాట లీకయిన నేప‌థ్యంలో 14వ తేదీన రిలీజ్ చేయాల్సిన ‘కళావ‌తి’ పాట‌ను ఆదివారం విడుద‌ల చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు.

Leave A Reply

Your email address will not be published.