కార్యకర్తతో రాసలీలలు..
బీజేపీ కరీంనగర్ అధ్యక్షుడిపై వేటు

కరీంనగర్: భారతతీయ జనతాపార్టీ కరీంనగర్ అధ్యక్షుడు బాస సత్యనారాయణపై పార్టీ అధిష్ఠానం వేటువేసింది. ఓ మహిళా కార్యకర్తతో రాసలీలల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆయనపై ఈ మేరకు చర్య తీసుకున్నారు. సత్యనారాయణ ఓ మహిళాతో అసభ్యకర రీతిలో మాట్లాడుతున్న ఓ ఆడియో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. సత్యనారాయణ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెంటనే ఆయన్ని పదవి నుంచి తొలగించారు. కాగా ఈమేరకు ఆయన స్థానంలో నూతన అధ్యక్షుడిగా గంగాడి కృష్ణారెడ్డిని నియమిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు.