కనుమరుగవుతున్న ‘చిందు కళ’కు పునరుజ్జీవం కల్పిస్తాం..

జనగామ (CLiC2NEWS): ప్రాచీనకళ వృత్తికళారూపం చిందు యక్షగానాన్ని ప్రభుత్వం మరింతగా‌ ప్రోత్సాహించే దిశగా కృషి చేస్తానని పునరుజ్జీవం కల్పిస్తామని జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి కలవల శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ‘చిందు యక్షగానం ‘ప్రధమ వార్షికోత్సవం పురస్కరించుకొని కళాకారుల జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకటయ్య, రాష్ట్ర అధ్యక్షులు సమ్మయ్య ఆధ్వర్యంలో చిందు యక్షగానం కళాకారులు లయన్స్ క్లబ్ లో ప్రదర్శన ఇచ్చారు.

అంతరించిపోతున్న చిందు కళారూపాలను కాపాడుకోవాలన్న తపన, ఆయా కళారూపాలపై ఆధార పడిన వారికి మనోధైర్యం కల్పించాలని పట్టణం నడి ఒడ్డున బస్టాండ్ సెంటర్ వద్ద వివిధ పౌరాణిక కళారూపాలు ప్రదర్శించి ర్యాలీ తీశారు. అనంతరం లయన్స్ క్లబ్ లో చిందు యక్షగానం కళారూపాన్ని ప్రదర్శించారు.

ఈ సందర్భంగా డి.పి.ఆర్.ఓ. పాల్గొని మాట్లాడుతూ.. కళారూపాలతోనే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ అయ్యేవని, మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికత పెరగడం, ప్రజలు అమితంగా ఇష్టపడే కళారూపాలు కనుమరుగవుతున్న దశలో కళపై ఆధారపడి జీవిస్తున్న కళాకారులను ఆదుకోవాలన్న సంకల్పం తో తమ కళారూపాన్ని గుర్తింపు కొరకు ప్రదర్శన చేపట్టారని, ఏవైనప్పడికి వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. కళాకారులలో వృద్దులకు ప్రభుత్వం ఫించన్లు మంజూరు చేస్తున్నదని, అడపా దడపా (మేడారం,జాతరలు)కార్యక్రమాలను కూడా ఇప్పిస్తూ వారి ఆర్థికాభివృద్ధి కి కృషిచేస్తున్నదన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సమ్మయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని‌ చిందు‌ కళాకారులను ఆదరించి ప్రోత్సాహం కలిగించాలని‌ కోరారు. కరోనా ప్రభావం వల్ల వృత్తి కళలు చితికిలపడ్డాయని అన్నారు. అంతరించి పోతున్న కళలను ప్రభుత్వం ఇప్పుడు అందిస్తున్న సహాయంతో పాటూ మరింత అధికంగా సహాయ సహకారాలు అందించాలని‌ కోరారు‌.

తొలుత అంబేద్కర్ విగ్రహం నుండి కళాకారులు వివిధ వేషాలంకరణతో పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ర్యాలీ గా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో జి.వై.గిరి పౌండేషన్ చైర్మన్ జి.కృష్ణ గడ్డం శ్యాంసుందర్, గడ్డం సోమరాజు, రాసాల ప్రభాకర్, గజవెల్లి రాములు, పిన్నింటి మురళి, గడ్డం రజితాద్రి, గడ్డం శేషాద్రి, గడ్డం సిద్దేశ్వర్ తదితర కళాబృందాలు యక్షగానం, కోలాట ప్రదర్శనలు ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.