31 దాకా బ‌డులు బంద్‌

పున:ప్రారంభం ఇప్పట్లో కష్టమే!

న్యూఢిల్లీ : కరోనా వైరస్ మ‌హమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఒక్క కొవిడ్ మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని త‌ల‌కిందుల చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో అన్ని స్కూల్స్‌ మూసివేత అక్టోబర్‌ 31 వరకూ కొనసాగుతుందని డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా స్పష్టం చేశారు. దేశ రాజధానిలో ఈనెల 5 తర్వాత స్కూళ్లు తెరుస్తారని ఢిల్లీ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్‌ 31 వరకూ స్కూల్స్‌ను తెరవబోమని, ఆన్‌లైన్‌ క్లాసులు యథాతథంగా జరుగుతాయని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఓ తండ్రిగా పరిస్థితి తీవ్రతను తాను అర్థం చేసుకోగలనని, ఈ సమయంలో పిల్లల ఆరోగ్యంతో రిస్క్‌ చేయడం సరైంది కాదని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారని సిసోడియా ఆదివారం ట్వీట్‌ చేశారు.

కాగా అక్టోబర్‌ 15 తర్వాత దశలవారీగా స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్ధల పున:ప్రారంభంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఓ నిర్ణయం తీసుకుంటాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన అన్‌లాక్‌ 5 మార్గదర్శకాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక స్కూల్స్‌ను తిరిగి తెరిస్తే విద్యార్ధులకు అటెండన్స్‌ను తప్పనిసరి చేయరాదని, తల్లితండ్రుల అనుమతితోనే విద్యార్ధులను స్కూళ్లకు రప్పించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రకటించడంతో మార్చి నుంచి విద్యాసంస్ధలన్నీ మూతపడ్డాయి. అయితే వైరస్‌ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో స్కూళ్ల పున: ప్రారంభంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

బ‌డులు బంద‌య్యాయి. చ‌దువులు అట‌కెక్కాయి. క్లాసు రూములు కాముగా ఉన్నాయి.. వీట‌న్నింటికి కార‌ణం క‌రోనా.. ఈ ఒక్క కొవిడ్ మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని త‌ల‌కిందుల చేసింది. ఈ వైర‌స్ విజృంభించ‌డంతో ప్ర‌పంచ దేశాలు అన్నీ బిక్కుబిక్కు మంటూ కాలం వెల్ల‌దీస్తున్నాయి. బ‌య‌ట‌కెళ్లాలంటేనే జ‌నం జంకుతున్నారు. వెళ్ల‌కుండా బ‌త‌క‌లేరు కాబ‌ట్టి మాస్కులు.. సానిటైజ‌ర్ల సాయంతో వారి వారి ప‌నులను చేసుకుంటున్నారు. మార్చి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అంటే లాక్‌డౌన్ (మార్చి 21) కంటే ముందే మార్చి 19వ తేదీ నుంచి పాఠశాలలు మూతపడ్డాయి. నిత్యం విద్యార్థుల ఎదుగుదలను కోరుకునే గురువుకు కరోనా కాలంలో ఎవరూ ఊహించని కష్టమొచ్చి పడింది. దేశ‌వ్యాప్తంగా వేల సంఖ్య‌లో బ‌డులున్నాయి. అవి ప్రైవేటు, ప్ర‌భుత్వం ఏవైనా కావ‌చ్చు.. ఈ స్కూళ్ల‌లో దాదాపు 30 ల‌క్ష‌ల మంది వ‌ర‌కు విద్యార్థులు విద్య‌న‌భ్య‌సిస్తున్నారు. స‌ర్కారు బ‌డుల్లో చేసే ఉపాధ్యాయులు కాకుండా ప్ర‌వేటు పాఠ‌శాలల్లో దాదాపు 3 ల‌క్ష‌ల మంది ఉపాధ్యాయులు ప‌నిచేస్తున్నారు. ఇప్పుడు ప్ర‌పంచాన్ని ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా దెబ్బ‌కు ఉపాధ్యాయుడు క‌కావిక‌ల‌మైపోతున్నాడు. ఇక విద్యార్థుల సంగ‌తి స‌రేస‌రి.. త‌ల్లిదండ్రుల‌కు దిక్కుతోచ‌టం లేదు.. పిల్ల‌ల భ‌విష్య‌త్‌పై తీవ్రంగా మ‌ద‌న‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో మొద‌లైన ఆన్‌లైన్ క్లాసులు ఎంత వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డుతున్నాయో ఆ దేవుడికే తెలియాలి.

Leave A Reply

Your email address will not be published.