‘సర్కారివారి పాట’ నుండి రెండో సాంగ్..
హైదరాబాద్ (CLiC2NEWS): మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం నుండి రెండో పాట విడుదలైంది. ఆదివారం సాయంత్రం ‘ఎవ్రీ పెన్నీ ఎవ్రీ పెన్నీ’ అంటూ సాగే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. నకాశ్ అజీజ్ అలపించారు. ప్రతి రూపాయిని అందరూ గౌరవింయాలంటూ సాగే ఈ పాట.. లిరికల్ వీడియోలో తమన్ బృందంతో కలిసి మహేశ్ బాబు కుమార్తె సితార స్టెప్పులేశారు. బ్యాంక్ కుంభకోణం వంటి విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.