హైదరాబాద్‌తో కలిసి పనిచేయనున్న బోస్టన్ సిటి

బోస్టన్ (CLiC2NEWS): హైదరాబాద్ నగరంతో కలిసి పని చేసేందుకు అమెరికాలోని బోస్టన్ సిటి ముందుకు వచ్చింది. బోస్టన్‌లో ఆరోగ్య రంగంపై జరిగిన గ్లోబర్ ఇన్నోవేషన్-2022 సదస్సులో పాల్గొన్న మసాచుసెట్స్ గవర్నర్ చార్లీ బేకర్.. మంత్రి కెటిఆర్‌కు హామీ ఇచ్చారు. హైదరాబాద్‌కు, బోస్టన్ నగరానికి మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయని ఆయన చెప్పారు. హైదరాబాద్ తరహాలోనే బోస్టన్‌లో కూడా ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటి రంగాలకు చెందిన అనేక కంపెనీలు పనిచేస్తున్నాయన్నారు. బోస్టన్ హెల్త్ రికార్డుల డిజిటలీకరణ కొనసాగుతుందని, తద్వారా అక్కడి పౌరులకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయన్న విషయాన్ని బేకర్ ప్రస్తావించారు. కరోనా సంక్షోభ సమయంలో డిజిటల్ హెల్త్ రికార్డుల వలన వేగంగా వారికి చికిత్స అందించేందుకు అవకాశం కలిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. ఇరు నగరాల మధ్య అవగాహన కోసం చేపట్లే కార్యక్రమాల వలన భవిష్యత్తులో మరిన్ని పెట్లుబడులు వచ్చే అవకాశం ఉందని మంత్రి కెటిఆర్ అభిప్రాయపడ్డారు. బయోలైఫ్ సైన్సెస్ రంగాలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలను వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో హెల్త్ రికార్డ్‌లను డిజిటలైజేషన్ చేస్తున్నామని తెలిపారు.