టైం 100 ఇంపాక్ట్ అవార్డును అందుకున్న బాలివుడ్ బ్యూటి క్వీన్ దీపికా..

బాలివెడ్ న‌టి దీపికా ప‌దుకొనెకు అరుదైన గౌర‌వం ద‌క్కింది. మాన‌సిక ఒత్తిడిపై అవ‌గాహ‌న కల్పిస్తూ దీపిక ప‌దుకొనె అందించిన సేవ‌ల‌కు టైం 100 ఇంపాక్ట్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా దీపికా పంచుకుంటూ ఆనందం వ్య‌క్తం చేసింది. దీపికా లీవ్‌ల‌వ్‌లైఫ్ అనే ఫౌండేష‌న్ ద్వారా మాన‌సిక ఒత్తిడిపై అవ‌గాహ‌న కల్పిస్తుంది. దీని ద్వారా ఎంతో మంది మాన‌సిక రోగుల‌కు చికిత్స కూడా అందిస్తుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా శాస్త్ర‌, రాజ‌కీయ‌, క‌లా రంగంలో అందించే సేవ‌ల‌కు గుర్తింపుగా ఈ అవార్డుతో స‌త్క‌రిస్తారు. యుఎఇ అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జి మంత్రి సారా అల్ అమీరి, ప్ర‌ముఖ సింగ‌ర్, ర‌చ‌యిత ఎల్లి గౌల్డింగ్, హుడా బ్యూటి వ్య‌వ‌స్థాప‌కురాలు హుడా క‌ట్టాన్‌, సంగీత క‌లాకారుడు విల్ ఐయామ్‌లు కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

Leave A Reply

Your email address will not be published.