తెలంగాణ ఎడ్సెట్ షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో బిఈడి ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్ షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 7 వ తేది నుండి జూన్ 15వ తేది వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్ధులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకొనేందుకు ఎస్సి, ఎస్టి అభ్యర్ధులు రూ. 450, ఇతరులు రూ. 650 చెల్లించాలి. రూ.250 ఆలస్య రుసుముతో జులై 1వ తేది వరకు, రూ. 500 ఆలస్య రుసుముతో జులై 15వ తేది వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఎడ్సెట్ కన్వీనర్ తెలియజేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో జులై 26,27 తేదీల్లో ఎడ్సెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణలో 220 బిఈడి కళాశాలలో 19,600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 50% మార్కులతో డిగ్రీ, ఇంజినీరింగ్ ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఎడ్సెట్ రాసేందుకు అర్హులు. ఎస్సి, ఎస్టి, బిసి, ఇతర రిజర్వేషన్ కేటగిరి అభ్యర్ధులకు 40% మార్కులు ఉంటే చాలని కన్వీనర్ తెలిపారు. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు కూడా ప్రవేశ పరీక్ష రాసేందుకు అర్హలని పేర్కొన్నారు.