జ‌ల‌మండ‌లిలో బాబు జ‌గ్జీవ‌న్ రామ్ జ‌యంతి వేడుక‌లు

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): అణ‌గారినవ‌ర్గాల శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అని, దేశానికి ఆయన చేసిన సేవ‌ల‌ను జ‌ల‌మండ‌లి మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ‌. ఎం.దాన‌కిషోర్ కొనియాడారు. జ‌ల‌మండ‌లి ప్రధాన కార్యాల‌యంలో బాబూ జగ్జీవన్ రామ్ జ‌యంతి వేడుక‌లు నిర్వ‌హించారు. ప్ర‌ముఖ‌ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాన మంత్రి డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ 115 వ‌ జ‌యంతి వేడుక‌ల్లో ముఖ్య అతిథిగా ఆయ‌న పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జగ్జీవన్‌రామ్‌ చిత్రప‌టానికి ఆయ‌న‌ పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. దళిత కులంలో పుట్టిన జగ్జీవన్ రామ్ పాఠశాల స్థాయి నుంచే చైతన్యం కలిగి చురుకైన విద్యార్థిగా రాణించారని పేర్కొన్నారు. తాను చదువుతున్నప్పుడు స్కూలులో దళితులకు పాఠశాలల్లో ప్రత్యేక మంచి నీటి కుండను ఏర్పాటు చేయడాన్ని సహించలేక అక్కడున్న అన్ని కుండలను పగలగొట్టి నిరసన తెలిపారని వివరించారు.

అలాగే కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానమంత్రిగా డాక్టర్‌‌‌‌‌‌‌‌ బాబూ జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ దేశంలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల హక్కులు, అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేశారని అన్నారు. ముఖ్యంగా కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖ మంత్రిగా దేశంలో ఆనాడు ఉన్న ఆహార కొర‌త‌ను ప‌రిష్క‌రించ‌డానికి హరిత విప్లవానికి నాంది పలికారన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో జ‌ల‌మండ‌లి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా.సత్యనారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్లు శ్రీధర్ బాబు, రవి కుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మిరా కృష్ణ, స్వామి, సీజీఎంలు సుదర్శన్, విజయ‌రావు, పద్మజ, జీఎం హ‌రి శంక‌ర్, వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ ప్రెసిడెంట్ రాంబాబు యాదవ్, చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణ, జనరల్ సెక్రెటరీ జైరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ అక్తర్, జ‌ల‌మండ‌లి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేష‌న్ యూనియ‌న్ నాయ‌కులు ల‌క్ష్మీ నారాయ‌ణ‌, శ్రీనివాస్, అశోక్, శంక‌ర్ ప్ర‌సాద్, న‌ర్సింగ్ రావు, జ్ఞానేశ్వర్, సీతయ్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

 

 

 

Leave A Reply

Your email address will not be published.