గ్రూప్-1,2 అభ్యర్ధులకు శుభవార్త.. స్టైఫండ్ ప్రకటన
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ పోటి పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనుంది. ఉచిత శిక్షణ కోసం మంత్రి గంగుల కమాకర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు.
వార్షిక ఆదాయం రూ. 5 లక్షల్లోపు ఉన్నవారు నేటి నుండి ఈనెల 16 వ తేది వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రి సూచించారు. ఏప్రిల్ 16 న ఆన్లైన్లో ఎంపిక పరీక్ష నిర్వహించి 1,25,000 మందికి ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభిస్తామని తెలిపారు.
గ్రూప్-1,2 రాసే 10 వేల మంది అభ్యర్ధులకు స్టైఫండ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. గ్రూప్-1 అభ్యర్ధులకు 6 నెలల పాటు నెలకు రూ. 5 వేలు, గ్రూప్-2 అభ్యర్ధులకు 3 నెలల పాటు నెలకు రూ. 2 వేలు, ఎస్ ఐ అభ్యర్ధులకు నెలకు రూ. 2 వేలు స్టైఫండ్ ఇచ్చేందుకు నిర్ణయించామని గంగుల కమలాకర్ ప్రకటించారు.