దేశ‌వ్యాప్తంగా జులై 17న నీట్ ప‌రీక్ష

హైదార‌బాద్ (CLiC2NEWS): దేశ‌వ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్ర‌వేశానికి నిర్వ‌హించే నీట్ ప‌రీక్ష షెడ్యూల్ విడుద‌లైంది. ఈ ప‌రీక్ష‌ను జులై 17 వ‌తేదీన నిర్వ‌హించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తులను మే 6వ తేది వ‌ర‌కు స్వీక‌రించ‌నున్నారు. దేశంలో 543 న‌గ‌రాల్లో, 13 భాష‌ల్లో ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తున్నారు. నీట్ ప‌రీక్ష‌ను తెలుగులో కూడా నిర్వ‌హించ‌నున్నారు. అభ్య‌ర్థులు రూ. 1,600 ప‌రీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈడ‌బ్ల్యుఎస్‌, ఒబిసి అభ్య‌ర్థులు రూ. 1500, ఎస్సి, ఎస్టి విద్యార్థులు, దివ్యాంగులు రూ. 900 చెల్లించాలి.

Leave A Reply

Your email address will not be published.