పరీక్షలను పండుగలా భావించాలి: మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట (CLiC2NEWS):ప్రతి విద్యార్ధి పరీక్షలను పండుగల్లా భావించాలని రాష్ట్ర వైద్యారోగ్యం శాఖా మంత్రి హరీశ్‌రావు సూచించారు. పదో తరగతి చదవే విద్యార్థుల మెరుగైన ఫలితాల కోసం వారి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ఉత్తరం రాస్తానని మంత్రి పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షల దృష్ట్యా స్పెషల్ డ్రైవ్ పెట్టి సిద్ధిపేట జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా కృషి చేయాలని విద్యాశాఖ అధికారులను హరీశ్‌రావు సూచించారు.
సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని న్యూ హైస్కూల్‌లో ఎన్ఆర్ఐ డాక్టర్ రాగి గంగరాం సహకారంతో రూ. 25 లక్షలతో నిర్మించిన భోజనశాలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..తాను చదివిన పాఠశాలకు డైనింగ్ హాల్ కట్టించి, అందరికీ గంగారాం స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఎవరైనా సరే కన్నతల్లిని, చదివిన బడిని, సొంత ఊరును మరచి పోవద్దనే పదానికి గంగారాం సార్ధకత చేకూర్చారని ప్రశంసించారు.