ఎపి నూతన కేబినేట్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్
![](https://clic2news.com/wp-content/uploads/2022/01/ap-new-district-jagan.jpg)
అమరావతి (CLiC2NEWS): అంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 11వ తేది ఉదయం 11 గంటల 31నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం గవర్నర్, సిఎం జగన్‌తో కలిసి పాత, కొత్త మంత్రులు తేనీటి విందులో పాల్గొంటారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఛైర్మన్లు, అధికారులకు ఆహ్వానాలు పంపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి Aa, A1, A2, B1, B2 కేటగిరీలుగా పాసులు జారీ చేశారు.