ఝార్ఖండ్‌లో రోప్‌వే ప్ర‌మాదం..

దేవ్‌గ‌డ్‌ (CLiC2NEWS):  ఝార్ఖండ్ లోని త్రికూట ప‌ర్వ‌తాల్లో 766 మీట‌ర్ల రోప్‌వేలో సాంకేతిక కార‌ణాల కార‌ణంగా కేబుల్ కార్లు ఢీకొన్నాయి. దీంతో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. కేబుల్ కార్ల‌లో ఉన్న 60 మంది అక్క‌డే ఉండిపోవాల్సి వ‌చ్చింది. వారిని సుర‌క్షితంగా తీసుకురావ‌డానికి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. సుమారు 45 గంట‌ల పాటు శ్ర‌మించి బాధితుల్ని తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు ముగిశాయి. కార్ల‌లో ఉన్న వారికి డ్రోన్‌ల సాయంతో ఆహారం, నీరు అందించారు.  వైమానికి ద‌ళం, ఆర్మీ, జాతీయ విప‌త్తు నిర్వ‌హ‌ణ సంస్థ‌ క‌లిసి చేప‌ట్టిన ఆప‌రేష‌న్‌లో 40 మందికి పైగా ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌లుగురు మృతిచెందారు. ప్ర‌మాదం జ‌రిగిన‌పుడు ఇద్ద‌రు మృతి చెంద‌గా.. స‌హాయ‌క చ‌ర్య‌ల‌లో మ‌రో ఇద్దరు మ‌ర‌ణించారు.

ఈ త్రికూట ప‌ర్వ‌తాల‌లో ఉన్న పొడ‌వైన వ‌ర్టిక‌ల్ రోప్‌వే దేశంలోనే అత్యంత ఎత్తైన రోప్‌వే. కేబుల్ కార్లు నిలిచిపోయిన చోటు.. భూ ఉపరిత‌లం నుండి సుమారు 1,500 మీట‌ర్ల వ‌ర‌కు ఎత్తు ఉన్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.