కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో దర్శకుడు రాజమౌళి..
కొమురంభీమ్ వారసులతో కలిసి రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని వీక్షించారు

ఆసిఫాబాద్ (CLiC2NEWS): కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అగ్ర దర్శకుడు రాజమౌళి సందడి చేశారు. జిల్లా మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎయిర్ బెలూన్ థియేటర్ను సతీసమేతంగా సందర్శించారు. జిల్లా కలెక్టర్ రాజమౌళి దంపతులకు స్వాగతం పలికారు. రాజమౌళి థియేటర్ ఆవరణలో ఏర్పాటు చేసిన కొమురంభీమ్ చిత్రపటానికి నివాళులర్పించారు. వారి వారసులను పలకరించి, థియోటర్లో జిల్లా అధికారులు, కొమురంభీమ్ వారసులతో కలిసి కొద్ది సేపు ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని వీక్షించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మహిళలంతా కలిసి థియేటర్ కట్టడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా మహిళా సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.