ఆచార్య ట్రైలర్ వచ్చేసింది..

హైదరాబాద్ (CLiC2NEWS): మెగాస్టార్ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నచిత్రం ఆచార్య. ఈ చిత్రం ట్రైలర్ వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. తండ్రి, కొడుకులు ఇద్దురూ ఒకే ఫ్రేమ్‌లో చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 29వ తేదీన విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం తాజాగా ప్రచార చిత్రాన్ని, కొన్ని ముఖ్యమైన థియేటర్లతో పాటు సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. మెగా అభిమానులు కోరుకునే అన్ని హంగులూ ఈ సినిమాలో ఉన్నట్లు తెలుస్తోంది.