గ్రూప్-1,2 అభ్యర్థులకు గుడ్న్యూస్
పోలీసు ఉద్యోగాలకు మూడేళ్ల వయోపరిమితి పెంపు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వూలు అవసరం లేదనే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు శుభవార్త నందించారు. పోలీసు ఉద్యోగాలకు మూడేళ్ల వయోపరిమితి పెంపునకు కూడా కేబినేట్ ఆమోదముద్ర వేసింది.
తెలంగాణ భవన్లో సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం పలు అంశాలకు ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.