కౌలు రైతుల బిడ్డ‌ల భ‌విష్య‌త్తు కోసం ప్ర‌త్యేక‌నిధి: జ‌న‌సేనాని

అనంత‌పురం (CLiC2NEWS): జ‌న‌సేన పార్టీనేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మంగ‌ళ‌వారం కౌలు రైతుల భ‌రోసా యాత్ర చేప‌ట్టారు.

ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల‌ను ఆదుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ చేప‌ట్టిన ‘కౌలు రైతుల భ‌రోసా యాత్ర’ శ్రీ స‌త్య‌సాయి జిల్లా కొత్త చెరువులో ప‌వ‌న్ ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతు సాకే రామ‌కృష్ణ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి, ఆ కుటుంబానికి రూ. ల‌క్ష ఆర్ధిక సాయాం చెక్కును అంద‌జేశారు. అనంత‌రం  అనంత‌పురం జిల్లాలోని కౌలు రైతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించి, వారికి ఆర్ధిక సాయం అంద‌జేశారు. త‌ర్వాత మ‌న్నెల గ్రామంలో ఏర్పాటు చేసిన స‌భ‌లో ప‌వ‌న్‌కాళ్యాణ్ మాట్లాడారు.

వైఎస్ ఆర్‌సిపి పాల‌న‌లో రాష్ట్రంలో 3వేల మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని జ‌న‌సేన అధినేత అన్నారు. గిట్టుబాటు ధ‌ర‌లేక రైతులు అనేక బాధ‌లు ప‌డుతున్నార‌ని, వారి క‌ష్టాన్ని క‌ళ్లారా చూశాన‌న్నారు. మ‌రోదారి లేక‌పోతేనే రైతు ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు. ఆత్మ‌హ‌త్య చేసుకున్న ప్ర‌తి రైతు కుటుంబానికి రూ. 7 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ఇవ్వాల్సిందేన‌ని ప‌వ‌న్ అన్నారు.

ప్ర‌తి రైతు కుటుంబానికి న్యాయం జ‌రిగే వ‌ర‌కు జ‌న‌సేన పోరాడుతూనే ఉంటుందిని అన్నారు. ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతుల పిల్ల‌ల బాధ్య‌త తీసుకుంటామ‌ని ఆయ‌న అన్నారు. అన్నం పెట్టే రైతుకు అండ‌గా ఉండాల‌నే కౌలు రైతు భ‌రోసా యాత్ర చేప‌ట్టామ‌ని అన్నారు. ప‌రామ‌ర్శ‌కు వ‌స్తున్నామ‌ని తెలిసి రైతు కుటుంబాల‌కు ప‌రిహారం ఇస్తున్నారు. ల‌క్ష రూపాయ‌లు ఇచ్చి చేతులు దులుపుకోవ‌డం కాదు. వారి బాధ్య‌త తీస‌కుంటామ‌ని అన్నారు. చ‌నిపోయిన కౌలు రైతుల బిడ్డ‌ల భ‌విష్య‌త్తు కోసం ప్ర‌త్యేక నిధిని ఏర్పాటు చేస్తామ‌ని, ఆ నిధి ప్ర‌భుత్వంలోకి వ‌చ్చాక కాదు.. ఇప్పుడే ఏర్పాటు చేస్తున్నామ‌ని ప‌వ‌న్ అన్నారు. సంక్షేమ నిధిలో సంగం డ‌బ్బు నేనిస్తాను, మిగిలిన సగం మా పార్టీ నేత‌లు ఇస్తామ‌ని మాట ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.