ఉగ్ర‌వాదుల‌కు నిధులు కేసు.. యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు

ఢిల్లీ (CLiC2NEWS): ఉగ్ర‌వాదులు, ఉగ్ర కార్య‌క‌లాపాల‌కు నిధులు స‌మ‌కూర్చిన కేసులో క‌శ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఎన్ఐఎ (జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌) కోర్టు జీవిత‌ఖైదు విధించింది. యాసిన్ మాలిక్ ఇటీవ‌ల త‌న నేరాన్ని అంగాక‌రించ‌డంతో ఎన్ఐఎ కోర్టు అత‌డిని దోషిగా తేల్చింది. అయ‌తే, ఈ కేసులో మ‌ర‌ణ‌శిక్ష విధించాల‌ని ఎన్ ఐ ఎవాదించిన‌ప్ప‌టికీ.. కోర్టు మాత్రం జీవిత‌ఖైదు విధించింది.

ఎన్ ఐఎ కోర్టులో వాద‌న‌ల సంద‌ర్భంగా యాసిన్ మాలిక్ మాట్లాడుతూ.. గ‌డిచిన 28 ఏళ్లో జ‌రిగిన హింస‌, ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల్లో త‌న పాత్ర ఉంద‌ని నిఘా సంస్థ‌లు నిరూపిస్తే రాజ‌కీయాల నుండి త‌ప్పుకోవ‌డమే కాకుండా మ‌ర‌ణ‌శిక్ష‌ను అంగీక‌రిస్తాన‌ని పేర్కొన్న‌ట్లు స‌మాచారం. అయితే, ఎన్ ఐఎ మాత్రం ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు నిధులు స‌మ‌కూర్చినందుకు అత‌నికి మ‌ర‌ణ‌శిక్ష విధించాల‌ని డియాంద్ చేసింది. ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం వేర్పాటు వాద నేత యాసిన్ మాలిక్‌కు జీవిఖూదు విధిస్తూ తీర్పును వెలువ‌రించింది.

Leave A Reply

Your email address will not be published.