Mancherial: పోలీసులు ఆధ్వ‌ర్యంలో మెగార‌క్త‌దాన శిబిరం

మంచిర్యాల (CLiC2NEWS): పట్టణ కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎఫ్‌సీఏ ఫంక్షన్‌ హాల్‌లో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సహకారంతో శుక్రవారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం పోలిస్ కమిషనర్‌ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి హాజ‌ర‌య్యారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంబించి రక్తదానం చేశారు.

అనంతరం సిపి చంద్ర‌శ‌ఖ‌ర్‌ మాట్లాడుతూ.. రెడ్‌క్రాస్‌ సొసైటీ రక్తనిధి కేంద్రంలో రక్తనిల్వలు తగ్గాయని సొసైటీ సభ్యులు తెలిపిన వెంటనే శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. రక్త దానము చేయడములో అపోహలు ఉండకూడదు అనీ, తీవ్రమైన వ్యాదుల నుండి గాని అనుకోని సంఘటనలు జరిగినప్పుడు సర‌యిన రక్తము లభించక ఎంతో మంది మరణించడము జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ఇటువంటి సామాజిక సేవలలో పాల్గొని తోటి వారి ప్రాణాలను కాపాడటములో తమవంతు సహాయము చేస్తున్నవిషయములో చాలా సంతోషము అని అన్నారు. తలసేమియా, సికిల్‌సెల్‌, ఎనీమియా వ్యాధిగ్రస్తులకు, అత్యవసర రోగులకు రక్తం లభించడం లేదన్నారు. ప్రతీ ఒక్కరు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకొని రాష్ట గవర్నర్ చేతుల మీదగా సేవ పత్రాలు అందుకుందని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది పోలీసులు, స్థానిక యువకులు, అటో డ్రైవర్స్ 351 యూనిట్ల రక్తదానం చేశారు. అనంతరం రక్తదానం చెసిన వారీకి ప్రశంస పాత్రలను సిపి అందించారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల జోన్ ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహాజన్ ఐపీఎస్, మంచిర్యాల ఏసిపి తిరుపతిరెడ్డి, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ నారాయణ మంచిర్యాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంజీవ్ లక్సెట్టిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కరీముల్లా ఖాన్, రెడ్ క్రాస్ అసోసియేషన్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ మహేందర్, రవీందర్,సబ్ డివిజన్ ఎస్సైలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.