సంగిత వెంకటరెడ్డి సేవలు చిరస్మరణీయం..
మండపేట (CLiC2NEWS): మాజీమంత్రి సంగిత వెంకటరెడ్డి ( చినకాపు) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయం అని మండపేట కాపు అభ్యుదయ సంఘం అధ్యక్షుడు జిన్నూరి సత్య సాయిబాబా అన్నారు. చినకాపు వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. సంగిత వెంకటరెడ్డి నగర్ లో కళ్యాణ మండపం వద్ద ఉన్న నిలువెత్తు విగ్రహానికి, ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సాయిబాబా మాట్లాడుతూ.. చినకాపు లాంటి నిస్వార్థ నాయకులు అరుదుగా ఉంటారన్నారు. ఆయన మంత్రిగా పనిచేసిన కాలంలో రాష్ట్ర ప్రజలకు విశేషమైన సేవలు అందించి ప్రజల మన్ననలు పొందారన్నారు. ఢిల్లీ రాజకీయాలను సైతం శాసించి ప్రకంపనలు సృష్టించారన్నారు. ఆలమూరు మండపేట నియోజక వర్గాల్లో ఎంతో మందికి రాజకీయ గురువుగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు.
మంత్రి హయాంలో పేద వర్గాలకు ఉపాథి అవకాశాలు కల్పించి వారికి అండగా నిలిచేవారన్నారు.రాజకీయాలకు దూరంగా ఉంటూనే తన సేవలకు స్వస్తి చెప్పకుండా ప్రజా సేవకు అంకితం చేసిన మహనీయుడని కీర్తించారు. మండపేట పట్టణంలో కాపు కళ్యాణ మండపం రూప కల్పనకు ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదన్నారు. ఆయన కృషి ఫలితంగానే పట్టణంలో కాపు కులస్థులకు సొంత భవనం ఏర్పాటు అయిందన్నారు. అటువంటి మహనీయున్ని సదా స్మరించుకోవడం కాపులుగా అందరి బాధ్యత అని గుర్తు చేశారు. కార్యక్రమంలో కాపు నాయకులు మెండు బాపిరాజు, యాళ్ల శ్రీనివాస్, దూలం చక్రవర్తి, సిద్దిరెడ్డి సూర్యారావు, గోకరకొండ భీమరాజు, కర్రి రామారావు( రాము), కొప్పిరెడ్డి కృష్ణ, దాసరి వెంకన్న, మీసాల రమణ, రెడ్డి రత్తయ్య, సలాది అన్నవరం, ఈలి తాతాజీ, దూలం నాగు, వాదా ప్రసాదరావు, సీతిని సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
మహనీయుడు సంగిత వెంకటరెడ్డి గారి ఫోటోలు కరువయ్యాయా… బాధాకరం, ఇప్పుడు రాజకీయ నాయకులు కు ధీటుగా ఎదుర్కొన్న నాయకులు మన సంగీత, మన తెలుగు వానిని మర్చిపోవాలా…