అంద‌రికీ `అమ్మ‌` నిర్మ‌ల‌మ్మ‌

వేదిక నుండి-వెండితెరకు.

తెలుగు చలన చిత్రసీమలో బామ్మ పాత్రలలో తనకంటూ ఓగుర్తింపు పొందిన నటీమణి నిర్మల. కృష్ణాజిల్లాలొని మచిలీపట్నంలో సెప్టెంబ‌రు నెల‌లో 1927 జన్మించిన ఈమె అసలు పేరు ‘రాజామణి’ చిన్ననాటి నుండి నాటకాల పట్ల ఆసక్తి కలిగి ఉండటం వలన నృత్యం అభ్యసించారు. నటి ఛాయదేవి మంచి నర్తకి, ఆమెతో కలసి నిర్మల చాలా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. మహానటి సావిత్రితో ఆ రోజుల్లో ‘ఉదయిని’ అనేనాటక సంస్ధ స్ధాపించి పలు నాటకాలు ప్రదర్శించారు. ఒక నాటక ప్రదర్శనకు హిందీనటుడు ఫృద్వీరాజ్‌క‌పూర్ వ‌చ్చి నిర్మలను ఆశీర్వదించారు.

 

 

 

 

 

 

 

 

అనంతరం నిర్మలాదేవిగా పేరు మార్చుకుని ఆంద్రనాటక కళాపరిషత్తులో ‘సారంగధర’ ‘కరువురోజులు’ ‘నాయకురాలు’ వేయిపడగలు’ వంటినాటకాలు ఈమెకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. చల్లపల్లి జమిందార్రాజాగారి సిఫారసుతో ఘంటసాలబలరామయ్యగారు నిర్మించిన ‘పార్వతికల్యాణం'(1941)లో మునికన్యగా నటించారు. అనంతరం గరుడగర్వభంగంస‌ (943)లో భానుమతిగారి చెలికత్తెగా నటించారు. ‘మాయాలోకం'(1945) రంగసానిగా, పల్నాటియుధ్ధంలో బృందనర్తకిగా నటించారు.

ప్రజానాట్యమండలి బృందంలోని జి.వి.కృష్టారావుగారిని 1946 వివాహంచేసుకున్నారు. ఆయన తరువాత సినిమాప్రొడక్షన్ మేనేజ‌ర్‌గా స్ధిరపడ్డారు.’అతామనవాళ్ళే'(1954) చిత్రంలో వల్లంనరసింహారావు సరసనకథానాయకిగా నటించే అవకాశంవచ్చింది. ఆచిత్రదర్శకుడు తాపిచాణిక్య ఈమెపేరు నిర్మలగా మార్చాడు. ఆచిత్రంలో నిర్మ లస్ధానంలో కృష్ణకుమారిని తీసుకున్నారు.

కె.ఎస్.ప్రకాశరావు సిఫారసుతో వి.మధుసూధనరావుగారి చిత్రం’మనుషులుమారాలి'(1969) బామ్మవేషం ఈమె సినీజీవితానికి మంచిపునాది వేసింది.’కృష్ణప్రేమ'(1961) ‘పేదరాసిపెద్దమ్మ'(1968) ‘దేవత'(1965)’కులగోత్రాలు'(1962) ‘జీవనతరంగాలు'(1973) ‘భార్యాభర్తలుస‌ (1961)’బలిపీఠంస‌ (1975) వంటిదాదాపు 900చిత్రాలకుపైగా అరవైఏళ్ళ సినీజీవితంలో నటించారు. వీరి చివరి చిత్రం’ ప్రేమకుస్వాగతం'(2002) అలాచిన్నవయసులోనే బామ్మపాత్రలలో ఒదిగిపోయింది.’మయూరి’ (1985) చిత్రం ద్వారా నంది అవార్డుస్వీకరించారు. సంతానంలేకపోవడం వలన ‘కవితస‌ అనే అమ్మాయిని పెంచుకున్నారు. ఆమెభర్త ప్రసాద్ నిర్మాత. ఈమెపలుచిత్రాలకు పెట్టుబడులు సమకూర్చేవారు. పరిశ్రమలో అందరూ ఈమెను ఇష్టపడేవారు. కళారంగానికి అసమానసేవలుఅందించి వేదికనుండివెండి తెరకువెళ్ళిన నిర్మల 2009 లో కళామతల్లి పాదసేవకై బ్రహ్మలోకం తరలివెళ్ళారు.

-డా.బెల్లంకొండనాగేశ్వరరావు

Leave A Reply

Your email address will not be published.