పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
![](https://clic2news.com/wp-content/uploads/2020/10/Gas.jpg11.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. చమురు సంస్థలు ధరను రూ. 50 మేరకు పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో గ్యాస్ ధర రూ. 1055 నుంచి రూ. 1105 కు పెరిగింది. కాగా పెంచిన ఈ ధరలు ఇవాల్టి నుంచే అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.
ఈ నెల 1వ తేదీన 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను రూ.183.50 మేర చమురు సంస్థలు తగ్గించిన విషయం తెలిసిందే.