హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం

హైదరాబాద్: హైద‌రాబాద్‌లో ఈరోజు సాయంత్రం ఉన్న‌ట్టుంది ఒక్క సారిగా మేఘాలు క‌మ్ముకొని భారీ వ‌ర్షం కురు‌స్తోంది. అక్కడ‌క్కడ పిడుగులు ప‌డ‌టంతో ప్రజలు భయంతో వణికిపోయారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరుకునే పీక్‌ అవర్స్‌ కావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, మాదాపూర్‌, ఖైరతాబాద్, అమీర్ పేట,కోఠీ,అబిడ్స్, చాదర్‌ఘాట్, లక్డీకపూల్, ప్యాట్నీ, సికింద్రాబాద్, ఉప్పల్‌లో విపరీతమైన ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ వాయువ్య దిశగా పయనించి సోమవారం ఉదయం తీరం దాటే సూచనలున్నాయని, శనివారం నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తామని వాతావరణ శాఖ తెలిపింది.

ముషీరాబాద్, గాంధీనగర్‌, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, బాగ్‌లింగంప‌ల్లి, రాంనగర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, షేక్‌పేట, టోలిచౌకి, ఎస్సార్‌నగర్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, బోరబండ, అబిడ్స్‌, అఫ్జల్‌గంజ్‌, కోఠి, పురానాపూల్‌లో భారీ వర్షం దంచికొడుతోంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఉద్యోగస్తులు డ్యూటీలు దిగి ఇంటికెళ్లి సమయం కావడంతో పలుచోట్లు భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్‌ పోలీసుల ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.ఇక నగరంలో వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం ఈ విధంగా ఉంది. ఖైరతాబాద్‌లో 10.5 సెం.మీ, బంజారాహిల్స్‌లో 9.8 సెం.మీ, జూబ్లీహిల్స్‌లో 9 సెం.మీ, నాంపల్లిలో 8 సెం.మీ సికింద్రాబాద్‌, చార్మినార్‌లో 6 సెం.మీ, ముషీరాబాద్‌లో 5 సెం.మీ,అంబర్‌పేట, రాజేంద్రనగర్‌లో 4 సెం.మీ వర్షపాతం నమోదు అయింది.

బాగ్ లింగంప‌ల్లిలో కురిసిన భారీ వ‌ర్షంతో రోడ్ల‌పైకి చేరిన వ‌ర‌ద నీరు

 

Leave A Reply

Your email address will not be published.