తెలంగాణ‌లో క‌ల‌పండి.. ఎపిలో విలీన గ్రామాల ప్ర‌జ‌ల డిమాండ్‌

ఖ‌మ్మం (CLiC2NEWS): ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న నేప‌థ్యంలో ఎపిలో విలీనం చేసిన త‌మ గ్రామాల‌ను తెలంగాణ‌లో క‌ల‌పాల‌ని అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలోని విలీన మండ‌లాల గ్రామాలు (ఏట‌పాక‌, గుండాల‌, పుషోత్త‌ప‌ట్నం, క‌న్నాయిగూడెం, పిచ్చుక‌ల‌పాడు) ప్ర‌జ‌లు ఆందోళ‌న చేశారు. ఈ మేర‌కు బుధ‌వారం సిపిఐ ఆధ్వ‌ర్యంలో క‌న్నాయిగూడెం రోడ్డుపై భారీ ఎత్తున ధ‌ర్నా చేప‌ట్టారు. ఉమ్మ‌డి ఎపి విభ‌జ‌న‌తో త‌మకు విద్య‌, వైద్యం.. త‌దిత‌ర క‌నీస వ‌స‌తులు క‌ర‌వ‌య్యాయ‌ని వారో ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌తీ ఏటా వ‌చ్చే గోదావ‌రి వ‌ర‌ద‌ల‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని ఆందోళ‌న కారులు తెలిపారు. వెంట‌నే తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాలు స్పందించి త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరారు. లేని ప‌క్షంలో ఆందోళ‌న ఉధృతం చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

Leave A Reply

Your email address will not be published.