పోలీసులు అంకితభావంతో విధులను నిర్వర్తించాలి: సిపి

రామగుండం పోలీస్ కమీషనరేట్ (CLiC2NEWS): రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి శుక్ర‌వారం రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ పెద్దపల్లి ఏసీపీ ఆఫీస్, పెద్దపల్లి సర్కిల్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ లను ఆకస్మికంగా తనిఖీలు చేశారు.

ఆఫీస్ లను, పోలీసు స్టేషన్ల పరిసరాలను సందర్శించి పోలీసుస్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణపై సిపి పరిశీలించారు. విధుల్లో భాగంగా పోలీసులు మెయింటేన్ చేసే రిసెప్షన్, జీడీ ఎంట్రీ తదితర ప్రతీ రికార్డును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. మారుతున్న నేరాల నమూనాకు అనుగుణంగా గస్తీ, పెట్రోలింగ్, విశబుల్ పోలీసింగ్ లను పెంచాలన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాత నేరస్తులు, సస్పెక్ట్ లు, రౌడీ షీటర్లపై నిఘాను ఉంచాలన్నారు.
పోలీస్ స్టేషన్లలో , ఫంక్షనల్ వర్టీకాల్స్ కోర్ట్ డ్యూటీ , రిసెప్షన్ , BC / పెట్రోల్ మొబైల్ , క్రైమ్ టీమ్స్ , టెక్ టీమ్స్ పనితీరు పరిశీలించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా చేపడుతుంటే సమాచారము అంధించిన వెంటనే చర్యలు చేపడతామని, సైబర్ నేరాల విషయంలో ప్రభుత్వం, పోలీస్ వారు చేస్తున్న సూచనలను పాటించాలని, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అని తెలియజేశారు.

పెద్దపల్లి ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహాజన్, ఏసిపి సారంగపాణి, సిఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ రాజేష్ తో పాటు పలువు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.