సంధివాతం (ఆస్టియో అర్థరైటీస్)

సంధివాతం (ఆస్టియో అర్థరైటీస్ )ఒక సర్వ సాధారణమైన జబ్బు. ఇది వయసు మీద పడుతున్నవారికి ఎక్కువగా వచ్చే సమస్య. భారతదేశంలో ప్రతి యేటా సుమారు 10 కోట్ల మంది ఈ రోగం భారీన పడుతున్నారు. సంధివాతం సమస్యలలో ఒకటి కంటే ఎక్కువ జాయింట్లు( కిళ్ళు,) కార్టీలేజ్ మెల్ల మెల్లగా అరిగిపోతుంది. ఇది చేతుల జాయింట్, వేళ్ళ జాయింట్స్, మెడ జాయింట్స్, వెన్నుముక జాయింట్స్, తుంటికీలు జాయింట్స్, మోకాళ్ళ జాయింట్స్ లో కార్టీలేజ్ అరిగిపోతే సంధివాతం వస్తుంది.

సంధి అంటే రెండు జాయింట్స్ వున్న చోట సంధి అంటారు. ఆలా అరిగిపోవటం వలన ఆ ప్రాంతంలో జాయింట్లు పెళుసుగా మారి విరిగిపోతాయి. దానితో కీళ్లు, ఎముకలు పరిస్పరం రాసుకుంటాయి. అప్పుడు కీళ్ళు వాపు వస్తుంది. నడక చాలా బాధగా ఉంటుంది. కొద్ది దూరం నడిచిన ఆ నొప్పులకు తాళలేరు. ఎప్పుడు కూర్చోవాలా బాబు అని అనిపిస్తుంది. సంధివాతం ఎక్కువగా పిరుదులు, మోకాళ్ళు, భుజాలు, చేతులు వంటి వంటి బరువు వహించాల్సిన కీళ్లను ప్రభావితం చేస్తుంది.

సంధివాతం లక్షణాలు:

1. కీళ్ళు బాగా నొప్పిరావటం. కీళ్ళు కిరకిరా సౌండ్ రావటం.
2. కీళ్ళు పట్టుకోవటం. బిగసుకోవటం.
3. రక్త నాళాలు, కండరాలు బలహీనంగా ఉండటం.
4. కీళ్ళు బాగా వాపు రావటం.
5. కీళ్ళు వంకరటింకరగా ఉండటం.
6. నడవటం, మెట్లు ఎక్కటం, ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి మెట్టు ఎక్కేటపుడు ఆ నొప్పి భరించలేనిదిగా ఉంటుంది.

కారణాలు:

1. వయసు మీద పడటం.45 years తరువాత వస్తుంది.
2. విచ్చల విడిగా తిని అడ్డంగా, నిలువుగా బరువు పెరగటం. లావు అవ్వటం.
3 మితిమిరిన స్థూలకాయం
4. హార్మోన్లు మార్పు
5. కీళ్ళ పై ఒత్తిడి ఎక్కువ పాడే విధంగా ఉండే పనులు చేయటం.
6. అసంతులిత ఆహారం.
7. అనియమిత దిన చర్య,
8. మధ్యపానం, దూమాపానం వంటి వ్యసనలు ఎక్కువగా ఉండటం.
9. మానసిక ఒత్తిడితో కూడిన దినచర్య.

ఈ పరీక్షలు చేయించి తెలుసు కోవాలి:

1. Xray. ఏం అర్ లు
2. రక్త పరీక్ష.

చికిత్స:

1 జీవన శైలిలో మార్పు
2. భౌతిక చికిత్స
3. యోగ మరియు ఫిజియో థెరపీ
4. పథ్యహారం, తినకూడనివి.

జీవనశైలిలో మార్పు గురించి.. ఉదయం మినిమం 20 నిముషాలు వాకింగ్,  తేలికపాటి వ్యాయామం, చేయాలి. అప్పుడు ఇలాంటి జాయింట్ పెయిన్స్ చక్కగా తగ్గుతాయి. సంధివాతన్ని చక్కగా నివారించుకోవచ్చును. ఎక్కువ సేపు కూర్చోవటం, ఎక్కువసేపు ఒకే స్థితిలో ఉండటం వలన ఈ సమస్య ఎక్కువ అవుతుంది. క్రియాశీలకమైన జీవనశైలిలో అలవర్చుకువాలి.
బరువులు ఎత్తేటపుడు శరీర స్థితి దృష్టిలో ఉంచుకోవాలి. డిప్రెషన్ రాకుండా చూసుకోవాలి. సరైన సమయానికి తినాలి. వేళకు చక్కగా నిద్రపోవాలి.

నియామబద్ధంగా యోగ, excercises చేయాలి. అప్పుడే కీళ్ళు కండరాలు, సంతులిత, శక్తి, ఫ్లెక్సీబిలిటీ వస్తాయి. Advance గా వచ్చే నొప్పులకు మంచి ఔషదంగా యోగ బాగా పనిచేస్తుంది.
యోగ ఆసనములు తాదాసనం, కటి చక్రాసన్, అర్ధ చక్రాసన్,….ప్రాణాయామం, కపాలాభాతి. అనులోమ విలోమ..తదితర…రోగ చికిత్సకు ఉపయోగ పడుతాయి.

పథ్యం.-ఆ పథ్యం.
ఈ రోగంలో భోజనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఇందుకు సంతులిత ఆహారం. నిషిద్ధ అహరుల్ని జాగ్రత్తగా పట్టించుకోవాలి.

ఆహారం..

1కాల్షియం తో కూడిన డైరీ పాల ఉత్పత్తులు, తీసుకోవాలి.
2. విటమిన్ సి తో కూడిన ఆహారం తీసుకోవాలి. కివి, ఉసిరి,
3. బీటా కేరొటీన్ ఉన్న ఆహారం క్యారట్, పాలకూర, బొప్పాయి, తీసుకోవాలి.
4. భోజనంలో పీచు పదార్దాలు ఉన్న కాయకురాలను ఎక్కువగా తీసుకోవటం చాలా మంచిది.
5. అల్లం, పసుపు, ఎక్కువగా వాడితే ఈ నొప్పులు తగ్గించుకోవచ్చును.
6. నొప్పులు వున్న చోట ఎండకు ఎక్సపోజ్ చేయాలి.

గృహవైద్యం:

1. ఎత్తుకు తగ్గట్లు బరువు ఉండేలా చూసుకోవాలి.
2. మీ యొక్క వయసును బట్టి శరీరానికి వ్యాయామం చేయాలి.
3. కీళ్ళ పై ఎక్కువగా భారం పడేటట్లు బరువులు మోయరాదు.
4. మనం పనులు చేసేటపుడు కీళ్ళు నొప్పి వస్తుంటే కూడా ఆ పనిని చేస్తూ ఉంటాం, ఇలాంటిది చేయకూడదు.
5. నొప్పిగా వున్నచోట వేడి, చల్లగా ఉండేవి పెట్టి కాపు పెట్టాలి.

హెచ్చరిక:

ముఖ్యంగా వయసు మీద పడుతున్నపుడు. గ్యాస్ ఉత్పత్తి చేసే ఆహారపదార్దాలు తినరాదు. బంగాళాదుంప, చెమగడ్డలు, కంద గడ్డలు, ఫ్రైడ్ చేసినవి, శనగ పిండి, మైదా పిండి తో చేసిన పదార్దాలు, తినరాదు. నాన్ వెజ్ తక్కువ తినాలి. ఆల్కహాల్ అసలు తాగరాదు. పాన్ పరంగా, గుట్కా, జర్ధా, తినటం వలన గ్యాస్ ఉత్పత్తి అయి జాయింట్స్ మీద కూడా effect పడుతుంది.

 

-షేక్.బహర్ అలీ
ఆయుర్వేద వైద్యుడు.

Leave A Reply

Your email address will not be published.