ఒక్క రూపాయికే వైద్య సేవలందించే డాక్టర్ కన్నుమూత..

కోల్‌కతా (CLiC2NEWS): ఒక్క రూపాయికే వైద్య సేవలందించే ప్రముఖ వైద్యుడు సుషోవన్ బందోపాధ్యాయ్ (84) కన్నమూశారు. గత కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. దాదాపు 60 ఏళ్ల పాటు ఒక్కరూపాయికే వైద్య సేవలందించిన ఆయనను ప్రజలు ఒక్కరూపాయి డాక్టర్ అని పిలిచేవారు. 1984లో కాంగ్రెస్ టికెట్‌పై బోల్పోర్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆయనకు 2020లో పద్మశ్రీ అవార్డు వరించింది. ఆయన పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో కెక్కింది. ఆయన మృతి పట్ల ప్రధాని మోడి, పశ్చిమబెంగా సిఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు.