44వ చెస్ ఒలింపియాడ్ పోటీలు ప్రారంభించిన ప్ర‌ధాని మోడీ..

చెన్నై (CLiC2NEWS): మొట్ట‌మొద‌టి సారి చెస్ ఒలింపియాడ్‌కు భార‌త్ ఆతిథ్యం ఇస్తుంది. 44వ చెస్ ఒలింపియాడ్ పోటీలు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ప్రారంభించారు. ఒలింపియాడ్ టార్చ్‌ను ప్ర‌ధాని మోడీ, త‌మిళనాడు సిఎం ఎంకె స్టాలిన్‌కు విశ్వ‌నాథ‌న్ ఆనంద్ అంద‌జేశారు. ఆగ‌స్టు 10వ తేదీ వ‌ర‌కు పోటీలు జ‌రుగుతాయి. ఈ ఒలింపియాడ్‌లో విశ్వ‌నాథ‌న్ పాల్గొన‌కుండా.. ఆట‌గాళ్ల‌కు మెంటార్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ.. చ‌ద‌రంగం మాతృభూమిపై ప్ర‌తిష్టాత్మ‌క ఈవెంట్ జ‌ర‌గ‌డం ఆనందంగా ఉంద‌. సొంత ప్రాంతంలో తొలిసారి చెస్ ఒలింపియాడ్ జ‌రుగోతోంది. గ‌త మూడు ద‌శాబ్దాల కాలంలో ఆసియాకు రావ‌డం ఇదే మొద‌టిసారి. క్రీడ‌లు ఎప్పుడూ అద్భుత‌మైన‌వే. త‌మిళ‌నాడులోని ఆల‌యాల‌ను ప‌రిశీలిస్తే.. దేవుడు కూడా చెస్ ఆడిన ఆన‌వాళ్లు క‌నిపిస్తాయి. అందుకే ఈ రాష్ట్రానికి చెస్‌తో ఎంతో చారిత్రాత్మ‌క అనుబంధం ఉంది. భార‌త్‌కే త‌మిళ‌నాడు చెస్ ప‌వ‌ర్‌హౌస్ అయింది. త‌మిళ‌నాడు ఎంతో మంది గ్రాండ్ మాస్ట‌ర్ల‌ను త‌యారుచేసింది. అని ప్ర‌ధాని మోడీ వివ‌రించారు.

Leave A Reply

Your email address will not be published.