Delhi High Court: ఆ ట్వీట్ల‌ను 24 గంట‌ల్లో తొల‌గించండి.. లేదంటే..?

ఢిల్లీ (CLiC2NEWS): కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె గోవాలో న‌కిలీ లైసెన్సుతో బార్ న‌డుపుతున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీ నేత‌లు చేసిన ఆరోప‌ణ‌ల‌పై శుక్ర‌వారం ఢిల్లీ హైకోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. వారు ఆరోప‌ణ‌లు చేస్తూ చేసిన ట్వీట్ల‌ను 24 గంట‌ల్లో తొలగించాల‌ని ఆదేశించింది. ఒక‌వేళ వారు ఆ ట్వీట్ల‌ను తొల‌గించ‌య‌పోతే.. వాటిని సోష‌ల్ మీడియా సంస్థ ట్విట‌ర్ తొల‌గించాల్సి ఉంటుంద‌ని స్స‌ష్టం చేసింది.

స్మృతి ఇరానీ కుటుంబంపై తీవ్ర అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ని, మంత్రి కుమార్తె గోవాలో న‌డుపుతున్న రెస్టారెంట్‌ న‌కిలీ లైసెన్సుతో న‌డుపుతున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి ప‌వ‌న్ ఖేడా ఇటీవ‌ల ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోప‌ణ‌లను స్మృతి ఇరానీ తీవ్రంగా ఖండించారు. అంతేగాకుండా న్యాయ‌ప‌ర‌మైన చర్య‌లు చేప‌ట్టారు. త‌న కుమార్తెపై చేసిన ఆరోప‌ణ‌ల‌ను త‌క్ష‌ణ‌మే ఉప‌సంహ‌రించుకోవాల‌ని, రాత‌పూర్వ‌క క్ష‌మాణ‌లు చెప్పాలంటూ లీగ‌ల్ నోటీసులు పంపారు.

Leave A Reply

Your email address will not be published.