Commonwealth Games: పాక్‌పై టీమ్ ఇండియా ఘన విజయం

మహిళల క్రికెట్ పోరులో పాకిస్థాన్‌పై టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. మొదట 99 పరుగులకే పాకిస్థాన్ బ్యాటర్స్‌ని కట్టడి చేసిన భారత్ క్రికిట్ అమ్మాయిలు.. కేవలం 2 వికెట్ల నష్టానికి 11.ల ఓవర్లలో 102 పరుగులు చేసి విజయం సొంతం చేసుకున్నారు. 100 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియ సునాయసంగా విజయం సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన (63*) హాఫ్ సెంచరీ చేసి జట్టులో కీలక పాత్రం పోషించింది. షఫాలీ వర్మ 16, సబ్బినేని మేఘన 14, రోడ్రిగ్స్ 2* పరుగులు చేశారు.