MP: ఓ ప్రైవేటు ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి!

జబల్పూర్ (CLiC2NEWS): మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సంభవించిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో అగ్నికీలలు ఎగసిపడుతుండటంతో అక్కడ ఉన్నటువంటి రోగుల్ని ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. సోమవారం సాయంత్రం ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుందని జిల్లా ఎస్‌పి సిద్ధార్ధ్ బహుగుణ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆస్పత్రిలో మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాద స్థలానికి అగ్నిమాపక, సహాయక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.