ఎన్‌టిఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి కన్నుమూత

హైదరాబాద్ (CLiC2NEWS): దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆఖరి కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఉమామహేశ్వరి మరణ వార్త తెలియగానే కుటుంబ సభ్యులంతా ఆమె నివాసానికి చేరుకున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి , బాలకృష్ణ, రామకృష్ణ, కల్యాణ్ రామ్ అక్కడికి చేరుకున్నారు. ఉమామహేశ్వరి భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.