సల్మాన్‌ఖాన్‌కు గన్ లైసెన్స్ ..

ముంబయి (CLiC2NEWS): బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు గన్ లైసెన్స్ మంజూరయింది. సల్మాన్‌ఖాన్ గన్ లెసెన్స్ కోరుతూ ఇటీవల దరఖాస్తు చేసుకోగా.. అతనికి ఆయుధ లైసెన్స్ జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. సల్మాన్‌ను, ఆయన తండ్రిని చంపుతానని బెదిరింపు లేఖ వచ్చిన విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో సల్మాన్ గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసినట్లు తెలుస్తుంది. సోమవారం ముంబయి పోలీసులు వెరిఫికేషన్ అనంతరం లైసెన్స్ మంజూరు చేశారు. పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా గతే మీకూ పడుతుందంటూ.. సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీంఖాలకు బెదిరింపు లేఖ రావడం.. దానిలో త్వరలో మూసేవాలా లాంటి పరిస్థితే మీకూ ఎదురవుతుందని అంటూ దుండగులు ఆ లేఖలో బెదిరించారు. పోలీసులు ఆయనకు వ్యక్తిగతంగా,, నివాసం వద్ద భద్రతను ఏర్పాటుచేశారు.