అందాల నటుడు హరనాథ్
డ్రీమ్‌గర్ల్ అంటే హేమామాలి అని ఠక్కున చెప్పగలం. తెలుగునాట డ్రీమ్ బాయ్ అని పిలిపించుకున్న నటుడు బుధ్ధరాజు అప్పల హరనాధ్. వీరు 1936 అక్టోబర్ 2న జన్మించారు. వీరి తండ్రి. వరహాలరాజు తూర్పుగోదావరిజిల్లాలోని పిఠాపురంలో సంపన్నకుటుంబం. ఇంగ్లీషు బాగామాట్లాడేవారు, పత్రికలకు కథలు రాసేవారు వీరికి పిఠాపురంలో ఉండే దేవులపల్లికృష్ణశాస్త్రి, పిఠాపురంరాజావారితో మంచి స్నేహం ఉండేది. రాజావారు కొద్దిరోజులు మద్రాసులోనూ కొద్దిరోజులు పిఠాపురంలో నూగడిపేవారు. అలావారితో పాటు మద్రాసువెళ్ళిన వరహాలరాజు అక్కడే మకాం మార్చారు.
ప్రముఖ సినీదర్శకుడు గూడవల్లిరామబ్రహ్మంగారి వద్దసహాయ దర్శకుడిగా, ‘మాయాలోకం'(1945) చిత్రానికి పనిచేసారు. ఈచిత్రంలో కథానాయకుడు అక్కినేని అన్న పాత్రధరించారు. తమిళం, మళయాళం మాట్లాడటం నేర్చుకున్నారు. ప్రముఖ తమిళ నిర్మాత ఏ.ఎల్శ్రీనివాసన్ని ప్రోత్సహించి ఆకలి, జీవితనౌక, తండ్రిఅనేమూడు మళయాళ చిత్రాలు కొనుగోలు చేయించారు. ఆ చిత్రలకు తాను స్వయంగా డబ్బింగ్ డైరెక్టర్‌గా పనిచేసారు. తొలుత ఆకలి చిత్రం తెలుగులో విడుదల చేసారు. తొలిమళయాళ చిత్రం తెలుగులో రావడానికి వరహాలరాజు ఆధ్యుడు అయ్యారు. అనంతరం జీవితనౌక, తండ్రి విడుదలఅయ్యాయి. ఈ మూడు చిత్రాలకు దేవులపల్లికృష్ణశాస్త్రిగారు మాటలు – పాటలు రాసారు.
మనడ్రింమ్బాయ్. చదువంతా మద్రాసులోసాగినా, డిగ్రీచేసింది కాకినాడలో తరువాత కాలంలో నిర్మాతలైన జగపతి రాజేంద్రప్రసాద్, ఏడిదనాగేశ్వరరావుగార్లతో మంచిస్నేహం ఉండేది. కప్పలు, -ఇనిస్పెక్టర్‌జనరల్ నాకాల్లొ రాజెంద్రప్రసా ద్ఆడవేషం, ఏడిద నాగేశ్వరరావు వృధ్ధుడి వేషం, హరనాథ్ కథానాయకుడు వేషం వేసేవారు. మద్రాసువచ్చిన హరనాథ్ నటుడు ముక్కామల దర్శకత్వంలో ‘బుష్యశృంగ'(1961) దీనికంటే ముందే హరనాథ్ నటించిన మరోచిత్రం నవశక్తివారిస మాయింటి మహాలక్ష్శి'(1959) విడుదలఅయింది. ఈ చిత్రం సారధి స్టూడియో కట్టిన తరువాత మొదట నిర్మింపబడింది. నిర్మాత గాగంగాధరరావుకు, దర్శకుడిగా గుత్తారామినీడుకు ఇదేతొలిచిత్రం.
నందమూరివారి ‘సీతారామకళ్యాణం'(1961)చిత్రంలో రాముని పాత్రహరనాథ్‌కు మంచిగుర్తింపును తెచ్చింది. ఈ చిత్రం ద్వారానే మణి అనేపేరు కలిగిన మంచినర్తకిని సీతపాత్రలో ‘గీతాంజలి’పేరున పరిచయం చేయబడ్డారు,
నందమూరి, అక్కినేనిల తరువాత తెలుగులో హరనాథ్ బీజీ అయ్యాడు. అలా కలసిఉంటేకలదుసుఖంస (1961)స భీష్మస (1962) ‘పెంపుడుకూతురుస (1963) సర్వరు సుందరంస (1966) ‘మురళికృష్ణస (1964) ‘భక్తప్రహ్లాద'(1967) ‘అమరలిల్పిజక్కన్న'(1964)’ పల్నాటియుధ్ధం'(1966)’ పెళ్ళిరోజు'(1968) పాలమనసులు'(1968) ‘లేతమనసులుస (1966)స శ్రీదేవిస (1970)’నాదీఆడజన్మ'(1965) ‘మదనకామరాజుకథ'(1962)స కథానాయకిమొల్లస (1970) ‘ఆడజన్మస (1970) ‘గుండమ్మకథ'(1962) చిట్టిచెల్లెలు'(1970) ‘పాండవవనవాసం'(1965)వంటి 177 తెలుగు,12తమిళం’ 1హిందీ, 1కన్నడ చిత్రాలలో నటించాడు. అతను మందుకు బానిసఅయ్యాడు. అందాలనటుడు ముఖంకళావిహీనంగా మారిపోయింది. అతని పతనంవెనుక పెద్దకుట్రజరిగిందని పరిశ్రమలో పలువురు అభిప్రాయపడ్డారు. హరనాధ్చివరిచిత్రం ‘నాగు'(1984)హరనాథ్‌ను మారుడుశ్రీనివాసరాజు ‘మాతెలుగుతల్లి'(1988) చిత్రంలో పరుచూరి బ్రదర్ర్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించాడు. కృష్ణంరాజు ప్రోత్సహించినా నటుడిగా నిలదొక్కుకులేకపోయాడు. నిర్మాతగా మారి ‘తొలిప్రేమ'(1998) చిత్రతీసి విజయం సాధించాడు. హరనాథ్ అందాలనటుడు. చేతిలో చిత్రాలులేకపోయినా చివరివరకు రాజులా నేజీవించారు. తన 53 ఏట తనువు చాలించారు.
-డా.బెల్లంకొండనాగేశ్వరరావు.