ఎపిలో వచ్చేనెల 1వ తేదీ నుండి కొత్త పథకాలు అమలు
![](https://clic2news.com/wp-content/uploads/2022/09/AP-NEW-LOGO.jpg)
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 1 నుండి వైఎస్ ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు అమలు చేయనున్నది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఈ పథకాలు అమలు చేయడానికి జగన్ సర్కార్ సిద్ధమయ్యింది. ఈమేరకు ప్రభుత్వం శనివారం జిఓను విడుదల చేసింది. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ.. ఇప్పటికి వరకు ఇచ్చిన హామీల్లో 98.44% అమలు చేశామని, అదే విధంగా పేద ఆడపిల్లలున్న కుటుంబాలు అండగా మరిన్ని పథకాల ద్వారా ఆర్ధిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు.
వైఎస్ ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు ద్వారా పేద అడపిల్లల వివాహాలకు ఆర్ధిక సాయం అందజేయనున్నారు. కల్యాణమస్తు కింద ఎస్సిలకు రూ. 1లక్ష, కులాంతర వివాహాలకు రూ. 1.2లక్షలు,
బిసిలకు రూ. 50వేలు, కులాంతర వివాహాలకు రూ. 75వేలు
విభిన్న ప్రతిభావంతుల వివాహాలకు రూ. 1.50లక్షలు,
భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు రూ. 40వేలు,
షాదీ తోఫా పథకం ద్వారా మైనార్టిల వివాహాలకు రూ. 1లక్ష చొప్పన ఆర్ధిక సాయం అందించనున్నారు. ఈ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం కొరకు గ్రామ, వార్డు సచివాలయాలలో తెలుసుకోవచ్చని జిఓలో పేర్కొన్నారు.