ఒకే వేదిక‌పై మోడీ, పుతిన్‌, జిన్‌పింగ్‌

బీజింగ్‌ (CLiC2NEWS): ఉజ్జెకిస్థాన్‌లో  షాంఘై స‌హ‌కార సంస్థ ఎస్‌సిఓ స‌భ్య దేశాల నేత‌ల శిఖ‌రాగ్ర స‌ద‌స్సు గురువారం జ‌ర‌గ‌నుంది. రెండు రోజుల పాటు కొన‌సాగే ఈ సమావేశాల్లో భార‌త్‌,  చైనా,  ర‌ష్యా, క‌జ‌క్‌స్థాన్‌, త‌జికిస్థాన్‌, ఉజ్జెకిస్థాన్‌,  పాకిస్థాన్ దేశాల నేత‌లు స‌మావేశం కానున్నారు. 2001లో  ప్రారంభ‌మైన‌ ఎస్‌సిఓలో భార‌త్‌, పాక్ దేశాలు 2017లో పూర్తిస్థాయి స‌భ్యుల‌య్యాయి.

ఎస్‌సిఓలో ప‌రిశీల‌క దేశాలుగా.. ఆఫ్గానిస్థాన్‌, బెలార‌స్‌, మంగోలియా కొన‌సాగుతున్నాయి. భార‌త ప్ర‌ధాని మోడీ, చైనా అధ్య‌క్షుడు షి జిన్‌పింగ్, ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్   పాకిస్థాన్ ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ ఒకే వేదిక‌పై స‌మావేశం కావ‌డం ఈ శిఖ‌రాగ్ర స‌ద‌స్సు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. క‌రోనా మ‌హ‌మ్మారి అనంత‌రం దేశాల నేత‌లు ఒకేచోట క‌లుసుకోవ‌డం ఇదే ప్ర‌థ‌మం.

Leave A Reply

Your email address will not be published.