సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్!

ఢిల్లీ (CLiC2NEWS): దేశ సర్వోన్నత న్యాయస్థానం తదుపరి సిజెఐగా జస్టిస్ డి.వై చంద్రచూడ్ నియమితులు కానున్నారు. సుప్రీంకోర్టు సిజెఐగా ఆయన పేరును ప్రస్తుత సిజెఐగా ఉన్నటువంటి జస్టిస్ యు.యు. లలిత్ ప్రతిపాదించారు. సుప్రీంకోర్టులో జరిగిన ఫుల్‌కోర్టు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సుప్రీంకోర్టు ప్రస్తుత సిజెఐ జస్టిస్ యు.యు.లలిత్ నవంబరు 8వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ పేరును సిఫార్సు చేశారు. జస్టిస్ చంద్రచూడ్ నవంబర్ 9వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా ఆయన రెండేళ్ల పాటు ఆ పదవీలో కొనసాగనున్నారు.