బాలికలు అన్ని రంగాలలో ముందుండాలి: మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్ (CLiC2NEWS): అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ నగరంలోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలని, ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అన్నారు. బాలికల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. బాలికలు అందరూ ఇది మా సమయం, మా హక్కులు, మా భవిష్యత్తు అనే నినాదంతో ముందుకు సాగాలని.. అందుకు అనుగుణంగా తగు ప్రాణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.