అనంతపురంలో భారీ వర్షం.. జలమయమయిన నగరం

అనంతపురం (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం భారీ వర్షాలు కురుస్తుండటంతో అనంతపురం, సత్యసాయి జిల్లాలలో వరద నీరు భారీ ప్రవహిస్తోంది. అనంతపురం నగరంలోని కాలనీలు, ఇళ్లలోకి సహితం నీరు చేరుకుంది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి యాలేరు, ఆలమూరు చెరువుల నుంచి వరద నగరాన్ని ముంచెత్తింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు మిద్దెలపైకి వెళ్లి కాలం గడపారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు సుమారు 300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజాప్రతినిధలు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. విజయవాడలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్‌ను అధికారులు మూసివేశారు. ఆలయానికి వచ్చే భక్తులు మెట్లు, లిఫ్ట్ మార్గాలలో రావాలని ఆలయ ఈఓ తెలిపారు.