పోలీసు సిబ్బంది బస్సును ఢీకొన్న బైక్.. ముగ్గురు మృతి

పాట్నా (CLiC2NEWS) : బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు ప్రయాణిస్తున్న బస్సును ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్నముగ్గరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎగిరి రోడ్డుపై పడి మృతి చెందారు. బైక్ బస్సు కిందకు దూసుకుపోయి మరో వ్యక్తి సజీవదహనమయ్యాడు. ప్రమాదం జరిగిన తర్వాత బస్సు బైక్‌తో సహా 100 మీటర్ల మేర ప్రయాణించింది. ఈ క్రమంలో ఇంధన ట్యాంకు పేలి మంటలు అంటుకుని బస్సు కింద చిక్కుకున్న వ్యక్తి సజీవదహనమయ్యాడు. మంటలు వ్యాపించాగానే బస్సులోని పోలీసులు కిందకు దిగారు. వీరంతా లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ 120వ జయంతి సందర్బంగా సితాబ్ దియారా ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్లే క్రమంలో బస్సును బైక్ ఢీకొట్టింది.